31 శాతానికి చేరిన పాజిటివిటీ

రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రరూపం దాలుస్తోంది. జనవరి 10వ తేదీన పాజిటివిటీ 4శాతం ఉండగా, 23వ తేదీనాటికి 31 శాతానికి చేరింది. అంటే 14 రోజుల్లో 27 శాతం వరకు పెరిగింది. శనివారం

Published : 24 Jan 2022 03:36 IST

14,440 మందికి కొవిడ్‌ నిర్ధారణ

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రరూపం దాలుస్తోంది. జనవరి 10వ తేదీన పాజిటివిటీ 4శాతం ఉండగా, 23వ తేదీనాటికి 31 శాతానికి చేరింది. అంటే 14 రోజుల్లో 27 శాతం వరకు పెరిగింది. శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల మధ్య 46,650 మందికి పరీక్షలు చేయగా.. 14,440 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. గత ఆదివారంతో (15.22%) పోలిస్తే పాజిటివిటీ రెట్టింపు కాగా, కేసుల సంఖ్య కూడా 10వేల వరకు అధికంగా ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖపట్నంలో ఆదివారం 2,258 కేసులు నమోదయ్యాయి.

ఎనిమిది జిల్లాల్లో సగటున వెయ్యిపైనే

వారం కిందటి వరకు 2జిల్లాల్లోనే అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కృష్ణా మినహా.. మిగిలిన 12జిల్లాల్లోనూ సగటున కేసుల సంఖ్య 500పైనే ఉన్నాయి. ఇందులో ఎనిమిది జిల్లాల్లో సగటున వెయ్యిపైనే నమోదవుతున్నాయి. ఆదివారం పరిశీలిస్తే.. విశాఖపట్నం తర్వాత స్థానంలో అనంతపురం 1,534, గుంటూరు 1,458, ప్రకాశం 1,399, కర్నూలు 1,238, చిత్తూరు 1,198, నెల్లూరు 1,103, తూర్పుగోదావరి 1,012 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

* అనంతపురం జిల్లాలో ఈ నెల 18న 462 కేసులు నమోదవ్వగా 23న 1,534కి పెరిగాయి. గుంటూరు జిల్లాలోనూ 758నుంచి 1,458కి చేరాయి. చిత్తూరు జిల్లాలో కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం అక్కడ 2,338 కేసులు నమోదవ్వగా ఆదివారంనాటికి 1,198కి తగ్గాయి.

* కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం చూస్తే.. జనవరి 16 నుంచి 22 మధ్య వారంలో సగటున చిత్తూరు జిల్లాలో 46.51%, విజయనగరం 41.29, విశాఖపట్నం జిల్లాలో 40.96% చొప్పున పాజిటివిటీ రేటు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు