చంద్రబాబు నివాసంలో గణతంత్ర వేడుకలు

ప్రజలకు ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించే రాజ్యాంగ నియమాలు అన్ని వేళలా అమలుకావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు

Published : 27 Jan 2022 02:43 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజలకు ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించే రాజ్యాంగ నియమాలు అన్ని వేళలా అమలుకావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మరోవైపు తెదేపా జాతీయ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం వింతపోకడలకు పోతోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పరుచూరి అశోక్‌బాబు, మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి, డూండీ రాకేశ్‌, సయ్యద్‌రఫీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని