AndhraPradesh News: 26 జిల్లాలొస్తున్నట్టే.. 3 రాజధానులొస్తాయి

రాష్ట్రంలో 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో, అదే తరహాలో మూడు రాజధానులూ వస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాల

Published : 29 Jan 2022 07:26 IST

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో, అదే తరహాలో మూడు రాజధానులూ వస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల ప్రజలకు కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు మరింత చేరువ కానున్నాయన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాల పునర్విభజన చరిత్రాత్మకం, అభివృద్ధి దాయకమన్నారు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు లాంటి వారని, చర్చల ద్వారా పీఆర్సీ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. భీమిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజనపై కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించే అంశాలను తెరపైకి తేవడం బాధాకరమన్నారు.  తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా విభజించి అధికార వికేంద్రీకరణ చేశారని గుర్తుచేశారు. భాజపా సైతం జిల్లాల విభజనను స్వాగతించిందని పేర్కొన్నారు. ఒక్క చంద్రబాబు తప్పా అంతా అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందాలని భావించడం సరికాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని