Updated : 15/11/2021 06:49 IST

AP News: కల్యాణ మండపం నుంచి వధువు పరారీ

 ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పోలీసుస్టేషన్‌కు 


మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: నాలుగైదు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా కల్యాణ మండపం నుంచి పరారైన వధువు మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం చోటు చేసుకుంది. మదనపల్లెకు చెందిన యువకుడికి, అదే మండలానికి చెందిన యువతికి పెద్దలు నెల క్రితం వివాహం నిశ్చయించారు. శనివారం రాత్రి స్థానిక కల్యాణ మండపంలో విందు ఏర్పాటు చేసి అక్కడే వధూవరులకు నలుగు పెట్టారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. శనివారం అర్ధరాత్రి వధువు మండపం నుంచి వెళ్లిపోయింది. తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు, బంధువులు రెండో పట్టణ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారంతా స్టేషన్‌ వద్ద ఉండగానే ఆ వధువు తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకొని అక్కడకు వచ్చింది. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.  యువతి మేజర్‌ కావడంతో ఆమె ఇష్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు. వధువు మాట్లాడుతూ.. ‘ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఈనెల 3న డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు వచ్చి నా తల్లిదండ్రులతో మాట్లాడారు. అప్పుడు పెళ్లి చేయమని పోలీసులకు చెప్పి.. ఆ తర్వాత నన్ను గృహ నిర్బంధం చేశారు. అందుకే వివాహ సమయంలో అందరూ నిద్రించాక వెళ్లి.. ప్రేమించిన వ్యక్తిని పుంగనూరులో పెళ్లి చేసుకున్నా’ అని తెలిపింది. 

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని