Updated : 03/10/2021 10:24 IST

కష్టార్జితం అగ్రిగోల్డ్‌లో.. వృద్ధాప్యం బాధల్లో: హైకోర్టుకు 72 ఏళ్ల బాధితుడి వినతి

భార్యనూ బతికించుకోలేకపోయా..

నా డిపాజిట్‌ సొమ్ము ఇప్పించండి 

ఈనాడు, హైదరాబాద్‌: ‘పదవీ విరమణ అనంతరం వచ్చిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో దాచుకున్నా. ఆ కంపెనీ మోసం చేయడంతో.. ఆస్తులను ప్రభుత్వం సీజ్‌ చేసి వేలం వేసింది. వచ్చిన సొమ్మును హైకోర్టులో డిపాజిట్‌ చేసింది. అందులోనుంచి నా సొమ్మును వాపసు ఇప్పించేలా ఆదేశాలివ్వండి’ అని కోరుతూ 72 ఏళ్ల రవికాంత్‌సిన్హా అనే బాధితుడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. రూ.26.4 లక్షలు డిపాజిట్‌ చేశానని, 6 ఏళ్లయినా సొమ్ము వాపసు ఇవ్వలేదని తెలిపారు. దీనిపై పోలీసులకూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. క్యాన్సర్‌ బారినపడిన తన భార్యకు.. నగదు లేక వైద్యం చేయించలేకపోవడంతో ఆమె చనిపోయిందని, కుమారుడు వేరుగా ఉంటున్నారని, వృద్ధాప్యంలో జీవనం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులు తెలంగాణలోనూ ఉన్నారని,  సంస్థకు చెందిన ఇక్కడి ఆస్తులను విక్రయించగా వచ్చిన సొమ్ము హైకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద డిపాజిట్‌ చేశారని చెప్పారు. ఆ మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వం రూ.900 కోట్లు అక్కడి డిపాజిట్‌దారులకు చెల్లించిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అగ్రిగోల్డ్‌పై ఇతర పిటిషన్లతో పాటు దసరా సెలవుల అనంతరం విచారణ చేపడతామని పేర్కొంది. 

* హైదరాబాద్‌ పంజాగుట్టలోని అగ్రిగోల్డ్‌కు చెందిన భవనాన్ని వేలం వేయగా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ నిరాకరిస్తున్నారని ఆంధ్రా బ్యాంకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ భవనాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిందని సబ్‌రిజిస్ట్రార్‌ చెబుతున్నట్లు పేర్కొంది.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని