వైకాపా పాలనలో 500 మంది మహిళలపై అఘాయిత్యాలు: గౌతు శిరీష

వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 500 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ధ్వజమెత్తారు. ఈ ఘటనల్లో ప్రభుత్వం ఎలాంటి

Published : 23 Aug 2021 03:52 IST

ఈనాడు, అమరావతి: వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 500 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ధ్వజమెత్తారు. ఈ ఘటనల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ఆదివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘లేని దిశ చట్టం పేరుతో తప్పించుకోవడం తప్ప.. నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిర్భయ చట్టం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.112 కోట్లు వస్తే.. అందులో రూ.38 కోట్లే ఖర్చు చేశారు’ అని విమర్శించారు. రెండేళ్లుగా మహిళలపై జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏ మంత్రైనా బహిరంగ చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. ‘దిశ చట్టం పేరుతో పోలీస్‌ స్టేషన్లనీ, కార్లు, ద్విచక్ర వాహనాలనీ ఊదరగొడుతున్నారు తప్ప.. మహిళలకు న్యాయం జరగడం లేదు. దిశ చట్టంలో అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్రం దస్త్రాన్ని తిప్పి పంపితే.. దానికి ఇప్పటివరకు వివరణ ఇచ్చే సమయం ఈ ప్రభుత్వానికి లేకపోయింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని