Published : 17 Sep 2021 07:44 IST

Brinda Karat: సీఎం జగన్‌ మౌనానికి కారణాలెన్నో!

కేంద్రం... విశాఖ ఉక్కును అమ్మేస్తే ఊరుకోం
సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌

ఈనాడు, విశాఖపట్నం: ‘కేంద్రం... ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తూ దేశ ఆర్థికవ్యవస్థ వెన్ను విరుస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకానికి ప్రయత్నాలు జరుగుతున్నా, ప్రత్యేక హోదా రాకున్నా సీఎం జగన్‌ మౌనంగా ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నారు అని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ విమర్శించారు. గురువారం విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయ స్నాతకోత్సవ మందిరంలో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగంగా సీపీఎం నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. ‘మోదీ ప్రభుత్వం ఒక్క ఏడాది వ్యవధిలో 67 సార్లు ధరలు పెంచింది. ఏకంగా రూ.3.5 లక్షల కోట్లు కేంద్రం  జేబులోకి వెళ్లారు.. కేరళకు కేంద్రం జీఎస్టీ వాటా తిరస్కరిస్తే అక్కడి పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచి పోరాడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కేరళ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఏపీలోనూ పార్టీలన్నీ ఒక్కటై... ముక్తకంఠంతో డిమాండు చేసి ప్రత్యేక హోదా/ప్యాకేజీ సాధించుకోవాలి. కేంద్రం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మితే ఊరుకోం’ అని బృందా కారాట్‌ స్పష్టంచేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని