అరాచక పాలన కొనసాగిస్తున్న వైకాపా

తెదేపా నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైకాపా కార్యకర్తల దాడిలో

Published : 29 Nov 2021 03:29 IST

మూక దాడిలో గాయపడ్డ సైదాను పరామర్శించిన తెదేపా నేతలు

నరసరావుపేటలో చికిత్స పొందుతున్న సైదాకు నగదు అందజేస్తున్న  మాజీ ఎమ్మెల్యే యరపతినేని, మాజీ మంత్రి పుల్లారావు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న సైదాను ఆదివారం తెదేపా నేతలు పరామర్శించి రూ.50 వేల నగదు అందజేశారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఇంతవరకూ అధికారులు నష్టం అంచనా వేయకపోవడం బాధాకరమన్నారు. రైతులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వైకాపా దుండగులు తెదేపా నాయకులు, కార్యకర్తలపై పైశాచిక దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు, హత్యకేసులు మోపి జైళ్లకు పంపారన్నారు. ఇప్పటివరకు 80 మంది తెదేపా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని వివరించారు. వారం రోజుల క్రితం సైదాపై దాడిచేస్తే పోలీసులు 324 కేసు పెట్టారని తెదేపా ఆందోళన చేస్తే 307 సెక్షన్‌ నమోదు చేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని