ముఖ్యమంత్రి గుప్పిట్లో స్థానిక సంస్థల ఆర్థికాధికారం

కేంద్రం విడుదల చేస్తున్న నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీల ఆర్థిక వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోడలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఆర్థికాధికారాన్ని ముఖ్యమంత్రి జగన్‌....తన గుప్పిట్లో

Published : 29 Nov 2021 03:30 IST

 భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజం

ఈనాడు డిజిటల్‌- అమరావతి,  న్యూస్‌టుడే, తాడేపల్లి: కేంద్రం విడుదల చేస్తున్న నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీల ఆర్థిక వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోడలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఆర్థికాధికారాన్ని ముఖ్యమంత్రి జగన్‌....తన గుప్పిట్లో పెట్టుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా .. గ్రామాల అభివృద్ధికి ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి అంతిమ ఫలాలు గ్రామీణులకు చేరడం లేదని దుయ్యబట్టారు. తక్షణమే ఏకగవాక్ష విధానం నుంచి స్థానిక సంస్థల ఆర్థిక కార్యకలాపాలను వేరుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహకాల విడుదలకు నెల రోజుల్లోగా ప్రభుత్వం కార్యచరణ చేపట్టాలని, లేదంటే ఉద్యమం చేపడతామన్నారు.

* రానున్న శాసనసభ ఎన్నికల్లో భాజపాని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలంతా పట్టుదలతో పనిచేయాలని సోము వీర్రాజు సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆదివారం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పార్టీ కార్యకర్తల కార్తిక వనసమారాధనలో మాట్లాడారు. ‘ఇటీవల తిరుపతికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భాజపా ఎన్ని సీట్లు గెలుస్తుందని అడిగారు. 40 స్థానాల్లో విజయం సాధిస్తామని తెలిపాం. దీనిపై అమిత్‌ షా స్పందిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని