భాజపా రాష్ట్ర కోర్‌ కమిటీ నియామకం

వివిధ అంశాలపై పార్టీలో చర్చలు జరిపేందుకుగానూ రాష్ట్ర కోర్‌ కమిటీని భాజపా ప్రకటించింది. 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులతో కూడిన ఈ కోర్‌ కమిటీకి భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా

Published : 30 Nov 2021 05:10 IST

ఈనాడు, దిల్లీ: వివిధ అంశాలపై పార్టీలో చర్చలు జరిపేందుకుగానూ రాష్ట్ర కోర్‌ కమిటీని భాజపా ప్రకటించింది. 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులతో కూడిన ఈ కోర్‌ కమిటీకి భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆమోదముద్ర వేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ తెలిపారు. కమిటీ నెలకు ఒకసారి సమావేశమవ్వాలని ఆదేశించారు. కోర్‌ కమిటీలో సభ్యులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.పురందేశ్వరి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్‌, సి.ఎం.రమేశ్‌, సుజనా చౌదరి, జి.వి.ఎల్‌.నరసింహారావు, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) మధుకర్‌, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత), రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు శివప్రకాష్‌, కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు వి.మురళీధరన్‌, రాష్ట్ర వ్యవహారాల సహ బాధ్యుడు సునీల్‌ దేవధర్‌లను నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని