Updated : 30/11/2021 05:34 IST

వైకాపాది రైతు వ్యతిరేక పాలన

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రైతు వ్యతిరేక పాలన సాగిస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సమనసలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న వరి చేలను సోమవారం ఆయన పరిశీలించారు. ఉప్పలగుప్తం మండలం మధురపేటకు చెందిన కౌలు రైతు మధుర సాయిబాబు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రతి రైతును కలిసి పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించి పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. గతేడాది వరి పంటకు సంబంధించి తమ ఖాతాల్లో నగదు జమ కాలేదని పలువురు రైతులు మనోహర్‌ దృష్టికి తీసుకువచ్చారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని