పెచ్చుమీరిన ప్రభుత్వ విప్‌ అవినీతి: కాలవ

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ కాపు రామచంద్రారెడ్డి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. గురువారం

Published : 03 Dec 2021 04:41 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ కాపు రామచంద్రారెడ్డి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు పెద్దఎత్తున ఇసుక, మట్టి అక్రమరవాణాకు పాల్పడ్డారని, నేమకల్లులో అక్రమ గనులు, రాయదుర్గం, బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌ మండలాల్లో అక్రమమద్యం, హెచ్చెల్సీ కాలువలో పైపులు, మోటార్లు వేసుకున్న వారి నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారన్నారు. రెండున్నరేళ్లలో వివిధ రూపాల్లో రూ.80కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ఎన్నో హామీలతో ఓటర్లను మభ్యపెట్టిన ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని