
AP News: తెదేపా ప్రభుత్వ తప్పిదాలే పోలవరానికి శాపం: ఏపీ మంత్రి అనిల్ యాదవ్
మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వెల్లడి
గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘ఈనెల ఒకటో తేదీ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న మాట వాస్తవమే. అయితే తెదేపా ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే చేయలేకపోయాం...’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం స్పిల్‌వే, కాఫర్ డ్యాంను ఒకేసారి కట్టింది. ఆయా పనులు సగం సగమే అయ్యాయి. ఈ నేపథ్యంలో గతేడాది వచ్చిన వరదలతో డయాఫ్రం వాల్, దిగువన కాఫర్ డ్యాం దెబ్బతింది. రెండు కి.మీ నదిలో పోవాల్సిన వరదను మార్చి పంపడంతోనే డ్యాం దెబ్బతింది. ఇలా సాంకేతిక సమస్యల కారణంగానే అనుకున్న లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయలేకపోయాం...’ అని మంత్రి అనిల్ వివరించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.