30 నెలల్లో నీటిపారుదల రంగంలో ఏం చేశారో?

గత 30 నెలల్లో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత శాతం పనులు చేశారో? వాస్తవాలతో శ్వేతపత్రం ప్రజల ముందు ఉంచే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి, జలవనరులశాఖ మంత్రికి ఉందా? అని మాజీ మంత్రి, తెదేపా నేత

Published : 03 Dec 2021 04:43 IST

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఈనాడు, అమరావతి: గత 30 నెలల్లో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత శాతం పనులు చేశారో? వాస్తవాలతో శ్వేతపత్రం ప్రజల ముందు ఉంచే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి, జలవనరులశాఖ మంత్రికి ఉందా? అని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారన్న ప్రజలకు సమాధానం చెప్పలేక అసహనంతో మంత్రి అనిల్‌కుమార్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఎద్దేవా చేశారు. దేవినేని గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపా హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌కి ఖర్చుపెట్టిన నిధుల్లో జగన్‌రెడ్డి తన 30 నెలల పాలనలో రూ.4 వేల కోట్ల వరకు కేంద్రం నుంచి పొందారు. చంద్రబాబు హయాంలో పనులు 71 శాతం వరకు పూర్తయితే...జగన్‌రెడ్డి ఎంత శాతం పనులు చేశారని ప్రజలు అడుగుతుంటే మంత్రి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని