‘సుప్రీం’ ప్రాంతీయ ధర్మాసనాలు ఏర్పాటు చేయండి

సుప్రీంకోర్టు దేశంలోని అన్నిప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ప్రాంతీయ ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని వైకాపా ఎంపీ వంగా గీత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అప్పుడు సర్వోన్నత

Published : 08 Dec 2021 04:37 IST

లోక్‌సభలో వైకాపా ఎంపీ వంగా గీత

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు దేశంలోని అన్నిప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ప్రాంతీయ ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని వైకాపా ఎంపీ వంగా గీత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో పని విభజన జరిగి, మరింత ఉత్పాదకంగా పని చేయడానికి వీలవుతుందన్నారు. మంగళవారం లోక్‌సభలో ‘సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల జీతాలు, సర్వీసెస్‌ కండిషన్స్‌’ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ... ‘న్యాయమూర్తుల జీతాలు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును స్వాగతిస్తున్నాం. ఇదే సమయంలో న్యాయవ్యవస్థకు అవసరమైన సంస్కరణలను అత్యవసర ప్రాతిపదికన తీసుకురావాలి. సుప్రీంకోర్టులో నలుగురు, హైకోర్టుల్లో 81 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారు. 5 హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తీ లేరు. దేశ జనాభాలో 50% ఉన్న మహిళలకు ధర్మాసనాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. బలహీనవర్గాలు, మైనారిటీలకూ ప్రాధాన్యం పెంచాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని