Published : 08/12/2021 04:41 IST

ఎంపీకి ఆహ్వానం లేకపోవడంపై అధిష్ఠానానికి ఫిర్యాదు

కొండవీడు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకుండానే వెనుదిరిగిన మంత్రులు

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఆహ్వానించకపోవడంపై పార్టీ అధిష్ఠానానికి ఆయన వర్గీయులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే రజని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయల నడుమ నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. మంగళవారం జరిగిన చిలకలూరిపేట మార్కెట్‌ యార్డు కార్యవర్గ ప్రమాణ స్వీకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల సత్కారానికి ఎంపీని ఆహ్వానించలేదు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తొలుత ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెరకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకర్‌రావు, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ క్రిస్టీనా, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, తదితరులు మధ్యాహ్నం కొండవీడులో జరగాల్సిన శంకుస్థాపనకు వెళ్లకుండా వెనుదిరిగారు. అయితే మంత్రులకు వేరే పనులు ఉండటంతో కొండవీడు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని