Updated : 08 Dec 2021 05:26 IST

తూతూమంత్రంగా రాష్ట్ర ప్రభుత్వ కమిషన్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

చిలకలూరిపేటలో మాట్లాడుతున్న సోము వీర్రాజు, పక్కన రావెల కిషోర్‌బాబు

ఈనాడు, అమరావతి: కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ తూతూమంత్రంగా ఉందని భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. న్యాయ విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రాజెక్టు గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి షెకావత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో జరిగే విషయాలు ఆయనకు తెలియదన్న భ్రమలో ప్రభుత్వం ఉందా? అని నిలదీశారు. ఓ జిల్లా ఎస్పీకి నెలకు రూ.5 కోట్లు ఎర్రచందనం వ్యవహారంలో అందుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఈ నెల 28న రాష్ట్రంలో భారీ ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎంపీ రఘురామకృష్ణరాజు భాజపాలో చేరనున్నారని వైకాపా ఎంపీ ఒకరు అన్నారు. అసలు రఘురామకు సీటు ఎందుకు ఇచ్చారు? మేం ఎందుకివ్వలేదో ఆలోచించాలి. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. పదవులు ఆశించి రాలేదు. 2024 తర్వాత రాజకీయాలకు ఇక దూరంగా ఉంటా’ అని పేర్కొన్నారు.

షెకావత్‌ను శ్రీకాళహస్తికి తీసుకెళ్లారుగా..

‘మా ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ రాసిస్తేనే కేంద్ర మంత్రి షెకావత్‌ పార్లమెంటులో చదివేస్తారా? ఆయనకేమీ తెలియదని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందా? కృష్ణా రివర్‌ బోర్డు ఏర్పాటు చేయించింది ఆయనే కదా? ఆయన పుట్టినరోజు వేడుకలను మీరు చేయలేదా? భాజపా నేతలకు చెప్పకుండా షెకావత్‌ను శ్రీకాళహస్తికి తీసుకెళ్లి దగ్గరుండి పూజలు చేయించలేదా?’ అని విమర్శించారు.

‘విశాఖ స్టీలు ప్లాంటును మేమేమైనా మూసేశామా? సీఎం సొంత జిల్లా కడప, ఆమదాలవలసలో మూతపడిన చక్కెర పరిశ్రమలను తెరిపించవచ్చు కదా! కమ్యూనిస్టులకు డబ్బు ఇచ్చి.. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భాజపా చేస్తేనే కమ్యూనిస్టులకు కనిపిస్తుందా? కమ్యూనిస్టులకు కళ్లు కనిపించడం లేదా? జగన్‌ సర్కారు విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు ఇవ్వట్లేదు.. ఈ విషయంలో కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు?’ అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..

మంగళగిరి, చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: పేదలకు మాజీ సీఎం ఎన్టీఆర్‌ కట్టించిన ఇళ్లకు డబ్బులు వసూలు చేయాలన్న వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి, చిలకలూరిపేటలలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును మళ్లీ పెట్టవద్దని కోరుతున్నామన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని