AP News: పవన్‌పై చంద్రబాబుది వన్‌సైడ్‌ ప్రేమ: సజ్జల

పవన్‌ కల్యాణ్‌తో పొత్తు కోసం చంద్రబాబు వన్‌సైడ్‌ ప్రేమను ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘పవన్‌తో పొత్తుకోసం చంద్రబాబు

Updated : 08 Jan 2022 08:47 IST

ఈనాడు, అమరావతి: పవన్‌ కల్యాణ్‌తో పొత్తు కోసం చంద్రబాబు వన్‌సైడ్‌ ప్రేమను ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘పవన్‌తో పొత్తుకోసం చంద్రబాబు చకోర పక్షిలా ఎంతగా ఎదురు చూస్తున్నారో కుప్పంలో ఆయన చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టమైంది’ అని వ్యాఖ్యానించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి వైకాపా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని నిరూపిస్తానని ఎంపీ రఘురామ కృష్ణరాజు అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా... ‘ఆయన్ని రాజీనామా చేయాలనే కదా మేమూ అడుగుతున్నాం. రాజీనామా చేసి ప్రజల్లోకి వెళితే ఎవరేంటనేది తేలుతుంది’ అని సజ్జల స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని