హిందూ వ్యతిరేక విధానాలు మానకుంటే యుద్ధం

హిందూ వ్యతిరేక విధానాలు మానుకోకపోతే వైకాపా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలపై నిరసన పేరిట

Published : 15 Jan 2022 04:09 IST

22న అన్ని నియోజకవర్గాల్లో సభలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

రాజమహేంద్రవరం(దేవీచౌక్‌), న్యూస్‌టుడే: హిందూ వ్యతిరేక విధానాలు మానుకోకపోతే వైకాపా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలపై నిరసన పేరిట శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా భోగి మంటలు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం భాజపా కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వీర్రాజు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలు కూల్చివేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం సహా రాష్ట్రంలో 150 చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగాయన్నారు. ఆత్మకూరు సంఘటనతో పరిస్థితి పతాక స్థాయికి చేరుకుందన్నారు. ప్రభుత్వ విధానాలపై ఈ నెల 22న అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని