వైకాపాను నమ్మి రూ.30 లక్షలు ఖర్చుపెట్టి నష్టపోయా..

వైకాపాపై అభిమానంతో రూ.30 లక్షలు ఖర్చుపెట్టి ఆర్థికంగా నష్టపోయినా.. పార్టీలో ఎటువంటి గుర్తింపు లేదని గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన ఎస్సీ నాయకుడు చిన్నా సెల్ఫీ వీడియో విడుదల

Updated : 15 Jan 2022 11:38 IST

సెల్ఫీ వీడియోలో వైకాపా ఎస్సీ నాయకుడి ఆరోపణ

అమరావతి, న్యూస్‌టుడే: వైకాపాపై అభిమానంతో రూ.30 లక్షలు ఖర్చుపెట్టి ఆర్థికంగా నష్టపోయినా.. పార్టీలో ఎటువంటి గుర్తింపు లేదని గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన ఎస్సీ నాయకుడు చిన్నా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పార్టీ కోసం పదేళ్లు కష్టపడినప్పటికీ ప్రజాప్రతినిధులు కిందిస్థాయి కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆక్షేపించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అన్ని సామాజిక వర్గాల కార్యకర్తలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలు, ర్యాలీలు చేసినా ఎవరూ గుర్తించడం లేదని వాపోయారు. పార్టీని నమ్ముకున్న వారు అన్ని విధాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని స్పష్టం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని