హత్యపై దర్యాప్తు జరుగుతుంటే చంద్రబాబుకు కంగారెందుకు?

హత్యా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలకు ఆద్యుడు చంద్రబాబే అని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్‌తో కలిసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలు ప్రతీ రోజూ సంక్రాంతి పండగ చేసుకునేలా ముఖ్యమంత్రి జగన్‌ పాలన సాగుతుంటే.. పండగ రోజూ చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాక్షస ఆలోచనలు భోగి మంటల్లో తగలబడిపోవాలని...

Updated : 15 Jan 2022 05:41 IST

మంత్రి వెలంపల్లి

ఈనాడు, అమరావతి: హత్యా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలకు ఆద్యుడు చంద్రబాబే అని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్‌తో కలిసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలు ప్రతీ రోజూ సంక్రాంతి పండగ చేసుకునేలా ముఖ్యమంత్రి జగన్‌ పాలన సాగుతుంటే.. పండగ రోజూ చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాక్షస ఆలోచనలు భోగి మంటల్లో తగలబడిపోవాలని కోరుకుంటున్నా. పల్నాడులో జరిగిన హత్యపై దర్యాప్తు జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారు? ఈ హత్యతో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదు’ అని అన్నారు.

తెదేపా హయాంలోనే హత్యలు: మల్లాది విష్ణు

జగన్‌ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారన్న ఈర్ష్యతోనే చంద్రబాబు పండగ వేళ కూడా రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు, తెదేపా హయాంలో మాచర్ల నియోజకవర్గంలో 2014-19 వరకు 17 మంది కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. అలాంటి హత్యా రాజకీయాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రోత్సహించే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

తెదేపా ఒంటరిగా పోటీ చేయగలదా?: జోగి రమేశ్‌

రాష్ట్రంలో వైకాపాను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ప్రశ్నించారు. తెదేపా, జనసేన, భాజపా ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలని ఆరాటపడుతున్నాయని విమర్శించారు. పొత్తులతో వైకాపా ప్రభుత్వాన్ని కూలదోద్దామనే ఆలోచనలే తప్ప, ప్రజల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని