వైఎస్‌ విగ్రహం చేయి ధ్వంసం

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం ఎంపీడీవో కార్యాలయం ముందున్న దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం కుడిచేయిని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ముఖాన్ని సైతం పాక్షికంగా విరగ్గొట్టారు.

Published : 17 Jan 2022 04:29 IST

వైకాపా నాయకుల ధర్నా, రాస్తారోకో

శ్రీరంగరాజపురం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం ఎంపీడీవో కార్యాలయం ముందున్న దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం కుడిచేయిని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ముఖాన్ని సైతం పాక్షికంగా విరగ్గొట్టారు. శనివారం స్థానికులు గుర్తించి స్థానిక వైకాపా నాయకులకు సమాచారమిచ్చారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ వైస్‌ఛైర్మన్‌ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట శనివారం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. తెదేపావారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అక్కడికి వచ్చి నాయకులతో మాట్లాడారు. నిందితులను శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. వైకాపా నాయకులకు నచ్చజెప్పడంతో వారు ధర్నా విరమించారు. కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని