యర్రగొండపాలెంలో రగిలిన పాతకక్షలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పాతకక్షల నేపథ్యంలో ఆదివారం ఓ వైకాపా నాయకునిపై దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లె గ్రామ పొలం విషయంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌, తెదేపా నేత చేకూరి

Published : 17 Jan 2022 04:29 IST

వైకాపా నాయకుడిపై దాడి

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పాతకక్షల నేపథ్యంలో ఆదివారం ఓ వైకాపా నాయకునిపై దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లె గ్రామ పొలం విషయంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌, తెదేపా నేత చేకూరి ఆంజనేయులు, తెదేపా మండల పార్టీ మాజీ అధ్యక్షుడు షేక్‌ జిలానీలపై గత నెల 20న తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వైకాపా సానుభూతిపరులు దాడి చేశారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం వ్యవసాయ పరపతి సంఘం మాజీ అధ్యక్షుడు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి ద్విచక్రవాహనంపై వస్తుండగా త్రిపురాంతకం బస్టాండ్‌ సమీపంలో జిలానీ కుమారుడు అబ్బాస్‌, అతని స్నేహితుడు దాడిచేశారు. చేయి, పొట్ట కింద గాయాలతో ఓబుల్‌రెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయన బంధువులు, మద్దతుదారులు కొత్తపల్లె నుంచి ద్విచక్రవాహనాలపై యర్రగొండపాలెం వచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సై సురేష్‌, సిబ్బంది అక్కడ ఎవరూ గుమిగూడకుండా చేశారు. తనపై జిలానీ, అతని కుమారుడు మొత్తం నలుగురు కత్తులతో దాడి చేశారని ఓబుల్‌రెడ్డి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనను స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్చిన అనంతరం బంధువులు నరసరావుపేట తరలించారు. పోలీసులు అబ్బాస్‌తో పాటు యాసిన్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో జిలానీ అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరారు. గొడవలు జరగకుండా త్రిపురాంతకం, పుల్లలచెరువు, వై.పాలెం ఎస్సైలు సురేష్‌, కృష్ణయ్య, సుధాకర్‌ల ఆధ్వర్యంలో పికెట్‌ ఏర్పాటుచేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని