
వివేకా హత్య కేసులో సహకరించకపోతే
ఎంపీ అవినాష్‌రెడ్డి భాజపాలో చేరతారు
వివేకా కుటుంబసభ్యుల వద్ద సీఎం జగన్ ప్రస్తావించారు
ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపణ
పులివెందుల, న్యూస్‌టుడే: ‘వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి అనుకూలంగా సహకరించాలని, లేనిపక్షంలో భాజపాలో చేరతానని ఆయన అంటున్నారు...’ అని వివేకానందరెడ్డి కుటుంబసభ్యులతో సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పడం వాస్తవమేనని తెదేపా ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) ఆరోపించారు. ఇది నిజమో... కాదో తెలుసుకోవాలంటే వివేకా కుటుంబసభ్యులు, ముఖ్యమంత్రిని సంప్రదించాలని ఆయన వైకాపా ద్వితీయశ్రేణి నాయకులకు సూచించారు. ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైకాపా నేత దేవిరెడ్డి శివశంకరరెడ్డితో దైవసన్నిధిలో మీరు ప్రమాణం చేయించగలరా అని వారికి సవాల్ విసిరారు. పులివెందులలోని తెదేపా హెచ్ఆర్డీ విభాగం రాష్ట్ర సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి నివాసంలో సోమవారం బీటెక్ రవి విలేకరులతో మాట్లాడారు. అవకాశం ఇస్తే తాను వైకాపాలో చేరతానని, ఆ పార్టీ పెద్దలను కలిశానని చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను తెదేపాను వీడే ప్రసక్తే లేదన్నారు. అవినాష్‌రెడ్డి అరెస్టయితే ఈ ప్రాంతంలో నాయకత్వ సమస్య తలెత్తుతుందని భావించి, చేరాలంటూ వైకాపా పెద్దలే తనను ఆహ్వానిస్తున్నారని బీటెక్ రవి పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.