Published : 18 Jan 2022 04:50 IST

మంత్రి కొడాలి నానిని బర్తరఫ్‌ చేయాలి

జూదం, అసాంఘిక కార్యక్రమాలపై ఎస్పీకి తెదేపా నేతల ఫిర్యాదు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: గుడివాడలో క్యాసినో తరహా జూదానికి కారకుడైన మంత్రి కొడాలి నానిని బర్తరఫ్‌ చేయాలని తెదేపా నాయకులు డిమాండు చేశారు. సంక్రాంతి సందర్భంగా మంత్రికి చెందిన కన్వెన్షన్‌ హాల్‌లో పెద్ద ఎత్తున సాగిన జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలకు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మచిలీపట్నం పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు నేతృత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌కు మచిలీపట్నంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో విష సంస్కృతిని ప్రోత్సహిస్తోందని, గంజాయి, ఇతర మత్తు పదార్థాల స్థాయిని దాటి క్యాసినో తరహా జూదాలకు తెరతీయడం హేయమన్నారు. మూడు రోజుల్లో దాదాపు రూ.500 కోట్ల జూదం సాగిందన్న విషయం బహిరంగ రహస్యమే అయినా పట్టించుకున్న వారు లేరన్నారు. బొండా ఉమా మాట్లాడుతూ ఇప్పటివరకూ బూతుల మంత్రిగానే పేరున్న నాని క్యాసినో మంత్రిగా మారారన్నారు. ఆధారాలతో ఫిర్యాదు చేశామని, చర్యలు లేకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రుల ఇలాకాలోనే జూదాలను ప్రోత్సహించి రాష్ట్రానికి జూదాంధ్రప్రదేశ్‌ అన్న అపకీర్తి మూటకట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. కొనకళ్ల నారాయణరావు, గుడివాడ మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వరరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు, పలువురు పార్టీ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ అసాంఘిక చర్యలను ఉపేక్షించబోమని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని