
పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా: మనోహర్
ఈనాడు-అమరావతి: ‘కరోనా మూడో వేవ్ ఆందోళనకరంగా ఉంది. విద్యాసంస్థలను ఈ నెలాఖరు వరకు మూసివేస్తేనే విద్యార్థులను వైరస్ బారినుంచి కాపాడుకోగలం. కేసులు పెరిగితే చూద్దామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేదని అర్థమవుతోంది’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసేసి ఆన్‌లైన్ విధానంలో తరగతుల నిర్వహణకు మార్గదర్శకాలనిచ్చాయి. వైద్య విద్యార్థులకే కరోనా సోకుతుంటే పాఠశాలల పిల్లల పరిస్థితేమిటి? అని ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.