
Published : 19 Jan 2022 03:44 IST
ఉద్యోగులు సమ్మె చేయకముందే జీవోలు ఉపసంహరించాలి
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్
ఈనాడు, అమరావతి: ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులు సీఎంకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని శైలజానాథ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం 30% హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటున్నారని... కొత్త విధానంలో 16 శాతమే వర్తిస్తుందని అన్నారు. ఫిట్‌మెంట్‌లో కోత విధించి డీఏ బకాయిల్లో సర్దుబాటు చేయడమేంటని మండిపడ్డారు. ఉద్యోగుల సమ్మెబాట పట్టకముందే జీవోలను ప్రభుత్వం ఉపసంహరించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
Tags :