కొన్ని సంఘాల వెనుక ఎవరో ఉన్నారు!

పీఆర్సీపై కొన్ని ఉద్యోగ సంఘాలు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాయని, ఎవరో వెనుక నుంచి నడిపించడంతోనే అవి సమ్మెకు వెళతామని చెబుతున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.

Published : 19 Jan 2022 03:47 IST

తెలంగాణలో ఆంగ్ల మాధ్యమంపై తెదేపా ఏం చేస్తుందో?
మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: పీఆర్సీపై కొన్ని ఉద్యోగ సంఘాలు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాయని, ఎవరో వెనుక నుంచి నడిపించడంతోనే అవి సమ్మెకు వెళతామని చెబుతున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పీఆర్సీ విషయంలో 23% ఫిట్మెంట్పై చాలా ఉద్యోగ సంఘాలు బాగానే ఉన్నాయి. కొన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. వెనుక నుంచి ఎవరి ప్రోద్బలమో లభిస్తుండటంతో ఆ కొందరు సమ్మెకు వెళతామని చెబుతున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. కొత్త విధానంలో జీతాలు తగ్గుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని అక్కడి మంత్రివర్గం నిర్ణయించింది. అదే మన రాష్ట్రంలో ప్రవేశపెడతామని ప్రకటించగానే తెదేపా నాయకులు వ్యతిరేకించారు. ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తారో... కోర్టులకు ఎలా వెళ్తారో చూడాలనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని