ఉద్యోగుల కోసం ఒకరోజు దీక్ష

రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పీఆర్సీ విషయంలో నిలువునా మోసపోయి డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా బుధవారం దిల్లీలోని తన నివాసంలో ఒకరోజు ఉపవాస దీక్ష నిర్వహించనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లలో మాట్లాడుతూ

Published : 19 Jan 2022 03:52 IST

ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ:  రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పీఆర్సీ విషయంలో నిలువునా మోసపోయి డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా బుధవారం దిల్లీలోని తన నివాసంలో ఒకరోజు ఉపవాస దీక్ష నిర్వహించనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లలో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న రివర్స్‌ పీఆర్‌సీ కానుక ఇస్తూ జీవో జారీ చేశారు. గతంలో ఆహా అన్న నాయకులు కూడా ఇప్పుడు ఉద్యోగుల ఆగ్రహ జ్వాలలను చవిచూసి మాకు ఈ పీఆర్‌సీ వద్దని ఉద్వేగంతో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అద్దెలు పెరిగిపోయిన నేపథ్యంలో హెచ్‌ఆర్‌ఏ తగ్గించడం చరిత్రలో కనీవినీ ఎరుగం. ఈ చర్యలకు నిరసనగా ఉపవాసదీక్ష చేసి వారికి సంపూర్ణ మద్దతు తెలపాలని నిర్ణయించాను’’ అని ఆయన పేర్కొన్నారు.

రేపు కలెక్టరేట్ల వద్ద ప్రదర్శనలు
పీఆర్సీలో పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూ ఈ నెల 20వ తేదీ గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో చేపట్టే నిరసన ప్రదర్శనలో పాల్గొననున్నట్లు ఏపీ పీటీడీ (ఆర్టీసీ) స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని