గుత్తేదారుకు బెదిరింపు... నెల్లూరు డిప్యూటీ మేయర్‌పై కేసు

రూ.87 కోట్ల పెన్నా పొర్లుకట్టల బండ్‌ టెండర్ల విషయంలో నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ బెదిరింపులకు పాల్పడ్డారని హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్‌లో

Published : 21 Jan 2022 05:36 IST

మంత్రి ఫోన్‌ నంబరు నుంచి కాల్‌ చేశారు

తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం

నెల్లూరు (ఇరిగేషన్‌), న్యూస్‌టుడే: రూ.87 కోట్ల పెన్నా పొర్లుకట్టల బండ్‌ టెండర్ల విషయంలో నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ బెదిరింపులకు పాల్పడ్డారని హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్‌లో గుత్తేదారు ఫిర్యాదు చేయడంతో గత నెల 24న 506, 504 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంత్రి బినామీకి ఈ పనులు అప్పగించేందుకు రివర్స్‌ టెండర్‌లో పాల్గొనవద్దని ప్రతి గుత్తేదారును ఆయన బెదిరించారని తెలిపారు. గురువారం నెల్లూరు నగరంలోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రివర్స్‌ టెండర్లో పాల్గొనవద్దని గుత్తేదారుకు అనేక ఫోను, వాట్సప్‌ కాల్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ఇప్పటికే రూప్‌కుమార్‌కు, మరో వ్యక్తికి నోటీసులు ఇచ్చారని పేర్కొంటూ సంబంధిత ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను ఆయన చూపించారు. పోలీసులు ఇచ్చిన వివరాల్లో మరొక ఫోన్‌ నంబరు ఉందని, అది మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ది అని  ఆరోపించారు. ఈ కేసులో త్వరలో ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని గుత్తేదారును రూప్‌కుమార్‌ కోరుతున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని