కొనసాగుతున్న లేటరైట్‌ తవ్వకాలు

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో 121 హెక్టార్లలో లేటరైట్‌ తవ్వకాల అవకతవకలపై ఆ ప్రాంతానికి చెందిన మరిడయ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు

Published : 21 Jan 2022 05:36 IST

ప్రభుత్వం అండతోనే దోపిడీ

చింతకాయల అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో 121 హెక్టార్లలో లేటరైట్‌ తవ్వకాల అవకతవకలపై ఆ ప్రాంతానికి చెందిన మరిడయ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు చేసిన ఫిర్యాదు విచారణలో ఉండ[గానే ప్రభుత్వం అండతో దోపిడీ కొనసాగుతోందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. నర్సీపట్నం విలేకరులకు గురువారం పంపిన వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బంధువైన తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఆయన తనయుడు విక్రాంత్‌రెడ్డి పర్యవేక్షణలో లవకుమార్‌రెడ్డి అనే వ్యక్తి లేటరైట్‌ పేరిట బాక్సైట్‌ తవ్వేస్తున్నారు. భారతి సిమెంట్‌ పేరిట ఉన్న లారీలు రోజూ వందల సంఖ్యలో అటవీ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందుకు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల డీఎఫ్‌వోలు, కలెక్టర్లు సహకరిస్తున్నారు. రక్షిత అటవీ ప్రాంతంలో పది కి.మీ. దూరం ఉపాధి హామీ పథకం నిధుల్లో రోడ్డు నిర్మాణం చేపట్టారు. గిరిజనుల కోసమే రోడ్డు వేసినట్లు విశాఖ జిల్లాకు చెందిన అటవీ శాఖ కన్జర్వేటర్‌ రామ్మోహనరావు చెబుతున్నారు. ప్రజల కోసమే రోడ్డు వేస్తే.. లారీల నుంచి కాంపౌండ్‌ ఫీజు వసూలు చేయాలి కదా?’ అని ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు