సిద్ధూకు మంత్రి పదవి కోసం పాక్‌ ప్రధాని లాబీయింగ్‌: అమరీందర్‌

నవజోత్‌ సింగ్‌ సిద్ధూను మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకోవాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ లాబీయింగ్‌ చేసినట్లు పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. ‘‘సిద్ధూను తొలగించిన తర్వాత.. ఉమ్మడి మిత్రుని ద్వారా నాకు

Updated : 25 Jan 2022 05:49 IST

దిల్లీ: నవజోత్‌ సింగ్‌ సిద్ధూను మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకోవాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ లాబీయింగ్‌ చేసినట్లు పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. ‘‘సిద్ధూను తొలగించిన తర్వాత.. ఉమ్మడి మిత్రుని ద్వారా నాకు ఒక సందేశం వచ్చింది. పాకిస్థాన్‌ ప్రధానికి సిద్ధూ పాత మిత్రుడనీ, సిద్ధూను తిరిగి కేబినెట్‌లో తీసుకుంటే కృతజ్ఞతతో ఉంటారని, ఒకవేళ సరైన పనితీరు కనపరచకపోతే అప్పుడు తొలగించాలని అందులో ఉంది’’ అని వివరించారు. ఆ విషయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీల దృష్టికి తాను తీసుకువెళ్లినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని