ఐదేళ్లలో రాజకీయాల్లోకి వస్తా: సోనూసూద్‌

ఇంకో ఐదేళ్లపాటు సమాజ సేవ చేసి, ఆ తర్వాత రాజకీయ చదరంగంలో అడుగుపెడతానని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, వితరణశీలి సోనూసూద్‌ చెప్పారు. ప్రజలకు సేవచేసే గుణం తమ కుటుంబ రక్తంలోనే ఉందన్నారు. కాంగ్రెస్‌ తరఫున మోగా నుంచి పోటీచేస్తున్న

Updated : 25 Jan 2022 05:43 IST

చండీగఢ్‌: ఇంకో ఐదేళ్లపాటు సమాజ సేవ చేసి, ఆ తర్వాత రాజకీయ చదరంగంలో అడుగుపెడతానని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, వితరణశీలి సోనూసూద్‌ చెప్పారు. ప్రజలకు సేవచేసే గుణం తమ కుటుంబ రక్తంలోనే ఉందన్నారు. కాంగ్రెస్‌ తరఫున మోగా నుంచి పోటీచేస్తున్న తన సోదరి మాళవికా సూద్‌కు మద్దతుగా నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని నేరుగా ప్రచారం చేయకపోయినా, తన సోదరిని గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని