Published : 28 Jan 2022 04:56 IST

రాష్ట్రంలో పరిపాలన దిగజారుతోంది

గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన రోజురోజుకూ దిగజారుతోందని.. మహిళలు, దళితులు, మైనార్టీ, వెనుకబడిన వర్గాలపై వేధింపులు, దాడులు పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. ‘గుడివాడలో క్యాసినో ఏర్పాటుచేసి తెలుగు సంస్కృతిని మంటగలిపారు. గోవా మహిళలతో అసభ్యనృత్యాలు చేయించారు. క్యాసినో నిర్వహణతో రూ.500 కోట్ల నల్లధనం చేతులు మారింది. క్యాసినో తతంగం మొత్తం గుడివాడలోని మంత్రి, వైకాపా నాయకుల కనుసన్నల్లోనే జరిగింది. దీనిపై గుడివాడ వెళ్లిన తెదేపా నిజనిర్ధారణ కమిటీకి పోలీసులు అవాంతరాలు సృష్టించి, అక్రమంగా నిర్బంధించారు. వైకాపా గూండాలు గుడివాడ తెదేపా కార్యాలయంపై, మా పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఇలా అధికార పార్టీ హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తోంది’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

బాధ్యులను వదిలేసి తెదేపా వారిపై కేసులు
గుడివాడలో విధ్వంసానికి కారణమైన వైకాపా వాళ్లను వదిలేసి తెదేపా వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారని లేఖలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘క్యాసినో ఘటనపై విచారణ చేయాలని మా నాయకుడు వర్ల రామయ్య కృష్ణా జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. విచారణకు నూజివీడు డీఎస్పీని నియమించడం హాస్యాస్పదం. తెదేపా నేతలపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేద్దామంటే డీఐజీ, కృష్ణా ఎస్పీ మాకు అందుబాటులోకి రాలేదు. డీజీపీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోగా.. మా వారిని రోడ్డుపై నిలిపి అక్కడే నివేదిక సమర్పించాలని ఒత్తిడి తెచ్చారు’ అని చంద్రబాబు వివరించారు. లేఖతోపాటు 8 వీడియోలు, నిజనిర్ధారణ కమిటీ నివేదిక, గోవా నుంచి రప్పించిన మహిళల వివరాలు, పత్రికల్లో వచ్చిన కథనాలను గవర్నర్‌కు అందజేశారు.

అడగడానికి మీరెవరంటున్నారు: వర్ల రామయ్య
తప్పు జరిగిందంటే.. అడగడానికి మీరెవరని పోలీసులు ప్రశ్నిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. క్యాసినో వ్యవహారంపై నిజాలు నిగ్గుతేల్చాలని కోరుతూ తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గవర్నర్‌ను గురువారం కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని