చౌక విద్యుత్తును వదిలేసి.. అధిక ధరలకు కొనడమేంటి?

రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చే విద్యుత్తును కాదని, అధిక ధరలకు కొనడమేంటని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం హిందూజా నుంచి యూనిట్‌ రూ.3.80కు కొనుగోలు చేయకపోవడాన్ని

Published : 04 Feb 2022 05:40 IST

కళావెంకట్రావ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చే విద్యుత్తును కాదని, అధిక ధరలకు కొనడమేంటని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం హిందూజా నుంచి యూనిట్‌ రూ.3.80కు కొనుగోలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా సుప్రీంకోర్టు పేర్కొందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ జలవిద్యుత్తుపై దృష్టి పెట్టి చౌకగా ఉత్పత్తి చేస్తుంటే జగన్‌రెడ్డి మాత్రం తన బినామీ కంపెనీల నుంచి అధిక ధరలకు కొనడానికి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని