కేంద్రంతో వైకాపా లాలూచీ: కనకమేడల

వైకాపా ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

Published : 13 Feb 2022 03:58 IST

ఈనాడు, దిల్లీ: వైకాపా ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్రంతో వైకాపా లాలూచీ వల్లే హోంశాఖ చర్చల ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారని ఆరోపించారు. వైకాపాకి చిత్తశుద్ధి ఉంటే 17న జరిగే సమావేశం ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టించాలని డిమాండు చేశారు. ‘కేంద్రం మెడలు వచ్చి హోదా సాధిస్తామని వైకాపా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే పక్కన పడేశారు. హోంశాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యుడిగా నాకు తెలిసినంతవరకూ సీఎం నుంచి హోదా అంశంపై ఇప్పటివరకూ కేంద్రంపై ఒత్తిడి చేయలేదు’ అని కనకమేడల డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని