నిరుద్యోగుల ఆత్మహత్యల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపిన జగన్‌: అచ్చెన్నాయుడు

నిరుద్యోగుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఉద్యోగాలు లేక రెండున్నరేళ్లలో 400 మందికి పైగా యువకులు

Published : 13 Mar 2022 05:24 IST

ఈనాడు, అమరావతి: నిరుద్యోగుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఉద్యోగాలు లేక రెండున్నరేళ్లలో 400 మందికి పైగా యువకులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉద్యోగాలు ఇవ్వాలంటున్న నిరుద్యోగులను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ సహా అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలి. జగన్‌రెడ్డి.. సీఎం అయ్యాక నిరుద్యోగం 14% పెరిగింది. నోటిఫికేషన్‌ ఇవ్వాలని అడిగినందుకు అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఏపీలో 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయన్న జగన్‌.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 66 వేల ఖాళీ పోస్టులే ఉన్నాయనడం యువతను మోసగించడం కాదా?’ అని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని