ధాన్యం కొనుగోళ్లపై విచారణ జరిపించండి: సోమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో మూడేళ్లుగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న దోపిడీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ధాన్యం

Published : 24 Mar 2022 05:28 IST

నెల్లూరు(కలెక్టరేట్‌, ఇరిగేషన్‌), న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లాలో మూడేళ్లుగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న దోపిడీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ధాన్యం గిట్టుబాటు ధర కోసం తెదేపా ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులో రైతులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల గోడు వింటుంటే కడుపు తరుక్కుపోతోందని పేర్కొన్నారు. పుట్టి ధాన్యం రూ.16,660కు కొంటున్నట్లు సీఎం జగన్‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పిన చోట రైతు భరోసా కేంద్రాలకు తాళాలు వేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని