Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్‌ స్థానంలో శ్రీకీర్తి?

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించబోయే ఉపఎన్నికలో వైకాపా తరఫున గౌతమ్‌ భార్య శ్రీకీర్తిని పోటీ చేయించే అవకాశమున్నట్లు

Updated : 31 Mar 2022 08:20 IST

ఈనాడు, అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించబోయే ఉపఎన్నికలో వైకాపా తరఫున గౌతమ్‌ భార్య శ్రీకీర్తిని పోటీ చేయించే అవకాశమున్నట్లు వైకాపా వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఆమె పోటీ చేస్తారా? లేదా? అనేది మేకపాటి కుటుంబం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ ఆమె పోటీ చేస్తే ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. ఆత్మకూరు ఉపఎన్నికను ఎన్నికల సంఘం ఖరారు చేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని