మీరు చేసినవే చెబుతుంటే ఉలుకెందుకు?: అచ్చెన్నాయుడు

రాష్ట్రవ్యాప్తంగా జె-ట్యాక్స్‌ వసూలు చేస్తుంటే ప్రకాశం జిల్లా బీట్యాక్స్‌ (బాలినేని ట్యాక్స్‌) వసూలు చేస్తోంది నిజం కాదా? అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Published : 10 Apr 2022 05:48 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జె-ట్యాక్స్‌ వసూలు చేస్తుంటే ప్రకాశం జిల్లా బీట్యాక్స్‌ (బాలినేని ట్యాక్స్‌) వసూలు చేస్తోంది నిజం కాదా? అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మూడేళ్లు మంత్రిగా పనిచేసిన బాలినేని ఒక్క ప్రజోపయోగకరమైన పనినైనా చేశారా? అని ప్రశ్నించారు. సొంత జిల్లా ప్రకాశంలో అభివృద్ధి పనులు ఏమైనా చేపట్టారా? అని నిలదీశారు. మీరు చేసినవే చెబుతుంటే అంత ఉలుకెందుకు? అని శనివారం మండిపడ్డారు. ‘బాలినేని శ్రీనివాసరెడ్డి ‘బీ ట్యాక్స్‌’ వసూళ్లను బయటపెట్టినందుకు తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఇంటిపై దాడి చేసేందుకు వైకాపా గూండాలు యత్నించడం దుర్మార్గం. ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి రాష్ట్రాన్ని వైకాపా నేతలు దోచుకుంటుంటే మేం చూస్తూ ఊరుకోవాలా? ఆర్థిక సంక్షోభం, కోర్టు మొట్టికాయలు, భూకబ్జాలపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో ముఖ్యమంత్రి మొదలు వైకాపా కార్యకర్తల వరకు అందరూ అసహనానికి లోనవుతున్నారు. వైకాపాలో అందరిలోనూ ఓటమి భయం పట్టుకుంది’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని