Andhra News: తిప్పేస్వామి సుడి తిరిగినట్లే తిరిగి.. నిమిషాల్లోనే తిరగబడి..

అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. మంత్రివర్గంలో పేరు ఖరారైంది...ఆయన సుడి తిరిగింది అని రాజకీయవర్గాల్లో చర్చా జరిగింది. కానీ, ఆయన సుడి నిమిషాల్లోనే తిరగబడింది. మడకశిర ఎమ్యెల్యే డాక్టర్‌ తిప్పేస్వామికి

Updated : 11 Apr 2022 07:50 IST

ఈనాడు, అమరావతి: అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. మంత్రివర్గంలో పేరు ఖరారైంది...ఆయన సుడి తిరిగింది అని రాజకీయవర్గాల్లో చర్చా జరిగింది. కానీ, ఆయన సుడి నిమిషాల్లోనే తిరగబడింది. మడకశిర ఎమ్యెల్యే డాక్టర్‌ తిప్పేస్వామికి ఆదివారం మంత్రివర్గంలో చోటు దక్కినట్లే దక్కి..దూరమైన తీరు ఇది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌ను మళ్లీ కొత్త కేబినెట్‌లోనూ కొనసాగిస్తున్నారని వార్త రావడంతో బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో జాబితాలో ముఖ్యమంత్రి కార్యాలయం కొంత మార్పు చేసింది. జాబితా నుంచి సురేష్‌ పేరును మార్చి ఆయన బావ అయిన తిప్పేస్వామి పేరును చేర్చింది. తిప్పేస్వామికి చోటు దక్కిన ఈ విషయం ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకొచ్చింది. కానీ, కొంతసేపటికే అది మారిపోయింది. ప్రకాశం జిల్లాలో మంత్రి లేకుండా పోతున్నారని మళ్లీ సురేష్‌కే సీఎం అవకాశం కల్పించారు. దీంతో మంత్రి వచ్చినట్లే వచ్చి మధ్యలోనే దారి మళ్లింది పాపం తిప్పేస్వామి అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. అమాత్యానందం తిప్పేస్వామికి 60 నిమిషాల వ్యవధిలో ఆవిరైనట్లయింది. 2014-19 మధ్య కాలంలోనూ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా చివర్లోనే అవకాశం దక్కింది. మడకశిరలో నెగ్గిన తెదేపా ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని అప్పట్లో కోర్టు తీర్పునివ్వడంతో రెండోస్థానంలో ఉన్న వైకాపా అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. వెంటనే తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అప్పటికే వైకాపా అసెంబ్లీని బహిష్కరించింది. దీంతో తిప్పేస్వామి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయిన పరిస్థితి ఎదురైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని