Sucharitha: అలక వీడని సుచరిత.. సజ్జల ఫోన్‌ చేసినా..!

మంత్రి పదవి దక్కక అలకబూనిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను పార్టీ పెద్దలు కలవకపోవటం ఆమె అభిమానులు, నియోజకవర్గ పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్ని

Published : 13 Apr 2022 08:25 IST

ఈనాడు, అమరావతి: మంత్రి పదవి దక్కక అలకబూనిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను పార్టీ పెద్దలు కలవకపోవటం ఆమె అభిమానులు, నియోజకవర్గ పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు రెండు రోజుల నుంచి గుంటూరులో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు.

ఆమెకు లేని పదవులు తమకు అవసరం లేదని తెలిపారు. ఆదివారం రాత్రి ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు ఆమె నివాసానికి వచ్చి ‘సామాజిక సమీకరణాల వల్ల చోటు కల్పించలేకపోయామని, మీకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుందని’ చెప్పి వెళ్లారు. అది మినహా తిరిగి ఇప్పటి వరకు అధిష్ఠానం నుంచి వచ్చి మాట్లాడిన పెద్దలు లేరని ఆమె వర్గీయులు అంటున్నారు.

సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని, పార్టీలో కొనసాగుతానని చెప్పారు. ఇంత జరిగినా పార్టీ వైపు నుంచి ఎలాంటి పలకరింపు లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌ చేసి రమ్మన్నారని, అయితే అనారోగ్యం కారణంగా కలవటానికి వెళ్లలేదని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని