‘మంత్రి కాకాణి ప్రేమకు’.. రెట్టింపు చూపిస్తా!

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి గత మూడేళ్లుగా తనపై ఎలాంటి ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత, వాత్సల్యం చూపించారో.. దానికి రెట్టింపు చూపిస్తానని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం నెల్లూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 13 Apr 2022 06:54 IST

ప్రమాణ స్వీకారానికి ఆయన నన్ను ఆహ్వానించలేదు: మాజీ మంత్రి అనిల్‌

ఈనాడు డిజిటల్‌- నెల్లూరు, న్యూస్‌టుడే-కలెక్టరేట్‌: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి గత మూడేళ్లుగా తనపై ఎలాంటి ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత, వాత్సల్యం చూపించారో.. దానికి రెట్టింపు చూపిస్తానని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం నెల్లూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రస్తుత మంత్రి తనను ఆహ్వానించలేదని, పిలవకుండా తాను ఎందుకు వెళ్లాలన్నారు. ఇటీవల తనకు ఆరోగ్య సమస్యలుంటే.. ఆస్పత్రికి వెళ్లానన్నారు. మంత్రివర్గ విస్తరణపై మాట్లాడుతూ కుటుంబం అన్నాక అలకలు, విభేదాలు, కలహాలు ఉంటాయన్నారు. ఎవరేమన్నా కాకాణి జిల్లా మంత్రి అని.. నెల్లూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అవసరమని భావిస్తే తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు.

పవన్‌కల్యాణ్‌ భీమ్లానాయక్‌ కాదు..

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకూ పోటీచేయలేని పవన్‌ కల్యాణ్‌.. భీమ్లానాయక్‌ కాదని, తెలుగుదేశం పార్టీ దగ్గర బిచ్చం అడుక్కునే బిచ్చనాయక్‌ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 2024లో తెదేపా దగ్గర బిచ్చమెత్తుకుని 35-40 సీట్లలో పోటీ చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎలా అవుతారన్నారు. పవన్‌ అభిమానులు తనపై ఎన్ని ట్రోల్స్‌ చేసుకున్నా.. తాను భయపడేది లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని