Andhra News: మంత్రి పదవి నాకు వెంట్రుకతో సమానం: కొడాలి నాని
తనను మాజీ మంత్రి అని అందరూ సంభోదించడం తనకు ఇష్టం లేదని, గుడివాడ ఎమ్మెల్యే అని పిలిపించుకోవడానికే ఇష్టపడతానని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మంత్రి
మాజీ మంత్రి అని సంబోధించకండి
గుడివాడ ఎమ్మెల్యే అంటేనే ఇష్టపడతాను
గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: తనను మాజీ మంత్రి అని అందరూ సంభోదించడం తనకు ఇష్టం లేదని, గుడివాడ ఎమ్మెల్యే అని పిలిపించుకోవడానికే ఇష్టపడతానని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమని, ఎమ్మెల్యే పదవి లేకుంటేనే ఎక్కువ బాధపడతానన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడులో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌రామ్ నూతన విగ్రహాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ... ‘పదవి ఉన్నా.. లేకున్నా జగన్ వెంటే ఉంటాను. పవన్‌కల్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. ఆయనతో పాటు లోకేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారు. జగన్ లేకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది...’ అని పేర్కొన్నారు. ఎంపీ సురేష్ మాట్లాడుతూ ద]ళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందిస్తే, బాబూ జగ్జీవన్‌రామ్ దాని ఫలాలను అట్టడుగువర్గాలకు అందించిన వ్యక్తి అని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి