Andhra News: మా కుటుంబంలో చిచ్చు పెట్టారు: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి

తమ కుటుంబంలో కొందరు చిచ్చు పెట్టారని  నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. దీన్ని చల్లార్చుకోలేక చచ్చిపోతున్నామని ఆవేదన చెందారు. ఉదయగిరిలో ఆదివారం జరిగిన స్వయం సహాయక

Updated : 09 May 2022 10:08 IST

ఉదయగిరి, న్యూస్‌టుడే: తమ కుటుంబంలో కొందరు చిచ్చు పెట్టారని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. దీన్ని చల్లార్చుకోలేక చచ్చిపోతున్నామని ఆవేదన చెందారు. ఉదయగిరిలో ఆదివారం జరిగిన స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం చెక్కుల పంపిణీ సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా కొందరు పని చేస్తున్నారని, దీనంతటికీ దుత్తలూరుకు చెందిన ఒకాయన కారణమని మండిపడ్డారు. ఇటీవల కాలంలో ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం వ్యవహరిస్తుండడంతో ఎమ్మెల్యే ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని