నేను గాంధీని కాను.. నా జోలికొస్తే గట్టిగా సమాధానం చెబుతా: మంత్రి దాడిశెట్టి రాజా

‘నేను గాంధీని కాను... ఎవరి జోలికీ వెళ్లను. నా జోలికి వస్తే గట్టిగా సమాధానం ఉంటుంది...’ అని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు.

Updated : 10 May 2022 08:00 IST

తుని, న్యూస్‌టుడే: ‘నేను గాంధీని కాను... ఎవరి జోలికీ వెళ్లను. నా జోలికి వస్తే గట్టిగా సమాధానం ఉంటుంది...’ అని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో సోమవారం జరిగిన వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘తునిలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి ఓ పార్టీ వారిపై నేను కేసులు పెట్టించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది నాకు సంబంధం లేని విషయం. సామాజిక మాధ్యమాల వేదికగా ఇద్దరి మధ్య జరిగిన వివాదం పెరిగి వారు కొట్లాడుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో పెట్టిన వారిని నేనే విడిపించాను. ఇప్పటికైనా వాస్తవాలను ఆ పార్టీ నాయకులు గుర్తించాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జనసేన నాయకులు ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి రాజా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పార్టీలు పెట్టిస్తూ, వాటితో పొత్తులు పెట్టుకుంటూ వస్తారని మంత్రి విమర్శించారు. జగన్‌ సమర్థుడని, ఆయన ఒంటరిగానే పోటీ చేస్తారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని