
YSRCP Office: వైకాపా కార్యాలయానికి జిల్లా జైలు స్థలం!
ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు
ఈనాడు డిజిటల్- రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే- నేరవార్తలు: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం స్థలంలో క్రమేపీ ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలకు గుట్టుచప్పుడు కాకుండా కేటాయింపులు జరిగిపోతున్నాయి. ఈ జైలు స్థలం మొత్తం 170 ఎకరాలు. ఇందులో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య కళాశాల కోసం దాదాపు 13 ఎకరాలను తీసుకుంది. తాజాగా అదే జైలు స్థలంలో మరో 2 ఎకరాలు తూర్పుగోదావరి జిల్లా వైకాపా కార్యాలయం కోసం కేటాయించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా అర్బన్ తహసీల్దార్ ద్వారా ప్రతిపాదనలు పెట్టారు. దీనిపై ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పైకి లీజు చెల్లించి వినియోగించుకుంటామని చెబుతున్నా... శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నందున క్రమంగా పార్టీ ఆ స్థలాన్ని సొంతం చేసుకుంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వైద్య కళాశాల కోసం తీసుకున్న స్థలంలో డీఐజీ కార్యాలయం, వసతి గృహాలు ఉన్నాయి. ఇప్పుడు వైకాపా కార్యాలయానికి స్థలం కేటాయించాలని ప్రతిపాదించడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్
-
Sports News
Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- AP Liquor: మద్యంలో విషం
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
- Amaravathi: రాజధాని భూముల అమ్మకం
- Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?