Beeda Mastan Rao: రాజ్యసభ టికెట్‌కు రూ.200 కోట్లైనా ఇచ్చేవారున్నారు: బీద మస్తాన్‌రావు

రాజ్యసభ టికెట్‌ను రూ.100 కోట్లకు అమ్ముకున్నారంటూ తెదేపా బురదజల్లే రాజకీయం చేస్తోందని వైకాపా అభ్యర్థి బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు. ‘రూ.100 కోట్లు తీసుకుని ఎంపీ టికెట్‌ ఇచ్చేలా ఉంటే రూ.200 కోట్లు ఇచ్చేందుకైనా

Updated : 20 May 2022 08:12 IST

వైకాపా అభ్యర్థి బీద మస్తాన్‌రావు 

ఈనాడు, అమరావతి: రాజ్యసభ టికెట్‌ను రూ.100 కోట్లకు అమ్ముకున్నారంటూ తెదేపా బురదజల్లే రాజకీయం చేస్తోందని వైకాపా అభ్యర్థి బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు. ‘రూ.100 కోట్లు తీసుకుని ఎంపీ టికెట్‌ ఇచ్చేలా ఉంటే రూ.200 కోట్లు ఇచ్చేందుకైనా ఓసీ అభ్యర్థులు సిద్ధంగా ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ‘వైకాపా అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు డబ్బుతో ఏమి అవసరం ఉంటుంది? రూ.10 కోట్లు, రూ.100 కోట్లతోనే కాలం గడిచిపోతుందా’ అని ప్రశ్నించారు. ‘గతంలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలకు టికెట్లు ఇచ్చారు. వారి నుంచి ఏ డబ్బు తీసుకుని టికెట్లు ఇచ్చారు? ఆర్‌.కృష్ణయ్య ఆర్థిక స్థితి అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మస్తాన్‌రావు కలిశారు. తనకు రాజ్యసభ టికెట్‌ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని