ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు

కాంగ్రెస్‌లో పని చేసి, మూడేళ్ల సమయాన్ని వృథా చేసుకున్నానని గుజరాత్‌లోని పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ తెలిపారు. ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేసిన ఆయన గురువారం అహ్మదాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘భాజపా, ఆప్‌లలో ఎందులో

Published : 20 May 2022 05:57 IST

 భాజపా, ఆప్‌లలో చేరికపై హార్దిక్‌పటేల్‌
 అయోధ్య, 370 అధికరణం రద్దుపై భాజపాకు ప్రశంసలు

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌లో పని చేసి, మూడేళ్ల సమయాన్ని వృథా చేసుకున్నానని గుజరాత్‌లోని పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ తెలిపారు. ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేసిన ఆయన గురువారం అహ్మదాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘భాజపా, ఆప్‌లలో ఎందులో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అయోధ్య, 370 అధికరణం రద్దు అంశాల్లో భాజపా ప్రసంశనీయమైన పనులు చేసింది’ అని హార్దిక్‌ పేర్కొన్నారు.  తన ఆధ్వర్యంలో జరిగిన పాటీదార్‌ ఉద్యమం కారణంగానే 2017 గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ లబ్ధి పొందిందని అన్నారు. కాంగ్రెస్‌లో కుల రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోరని ధ్వజమెత్తారు. గుజరాత్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనకు పదవి ఇచ్చినా... ఎలాంటి పని అప్పగించలేదని, ముఖ్యమైన సమావేశాలకూ పిలవలేదని ఆరోపించారు. తనపై నమోదైన రాజద్రోహం కేసుల కారణంగా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే హార్దిక్‌ పటేల్‌ పార్టీకి రాజీనామా చేశారని గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగదీశ్‌ ఠాకుర్‌ ఆరోపించారు. హార్దిక్‌ భాజపాలో చేరబోతున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు