హిందూపురం వైకాపాలో అసమ్మతి సెగ!

హిందూపురం అధికార వైకాపాలో అసమ్మతి సెగ మొదలైంది. పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల సమీపంలో శనివారం కొందరు నేతలు రహస్య సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది.

Published : 22 May 2022 05:58 IST

హిందూపురం, న్యూస్‌టుడే: హిందూపురం అధికార వైకాపాలో అసమ్మతి సెగ మొదలైంది. పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల సమీపంలో శనివారం కొందరు నేతలు రహస్య సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం స్థానికులకే పార్టీ ఇన్‌ఛార్జి పదవి ఇవ్వాలని నినదిస్తూ పలువురు కార్యకర్తలు బయటకు వచ్చారు. మీడియా ముందు ఇప్పుడే మాట్లాడలేమని, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి అన్ని విషయాలు చెబుతామన్నారు. సమావేశానికి నియోజకవర్గంలోని కొందరు ముఖ్య నేతలతోపాటు 20 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎంపీపీలు, ఒక జడ్పీటీసీ సభ్యుడు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని